పేటీఎం ఉద్యోగికి కరోనా పాజిటివ్‌

న్యూఢిల్లీ : పేటీఎం ఉద్యోగికి కరోనా వైరస్‌ సోకినట్టు ఆ సంస్థ బుధవారం వెల్లడించింది. గురుగ్రామ్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా తెలిందని వెల్లడించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ఉద్యోగి ఇటీవలే ఇటలీ నుంచి తిరిగివచ్చినట్టు వెల్లడించింది. కరోనా సోకిన వ్యక్తి టీమ్‌ మెట్స్‌ వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరింది. అలాగే గురుగ్రామ్‌ యూనిట్‌ను శుభ్రపరిచేవరకు ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని సూచించింది. ఇది తమ రోజువారి కార్యాకలాపాలపై ఎటువంటి ప్రభావం చూపబోదని పేటీఎమ్‌ స్పోక్స్‌పర్సన్‌ ఒకరు తెలిపారు.(చదవండి : అప్పుట్లోనే ‘కరోనా’ను ఊహించారా?)